నుదుటిపై పింక్ డైమండ్.. అలా కొట్టేయాలనుకున్నారు..

    0
    1073

    లిల్ ఉజి వర్ట్, ఓ మంచి ర్యాపర్. అతడికి ఓ పిచ్చి ఉంది. ఏకంగా నుదిటిపై పింక్ డైమండ్ అంటించుకున్నాడు. ఆపరేషన్ ద్వారా దాన్ని శరీరంలో ఇముడ్చుకున్నాడు. దాని ఖరీదు 176 కోట్ల రూపాయలు. 11 క్యారెట్స్ విలువ కలిగినది అది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆపరేషన్ ద్వారా దాన్ని నుదుడిపై పెట్టుకున్నాడు ఉజివర్ట్. అయితే అప్పటినుంచి అతనికో సమస్య వచ్చి పడింది. ఎక్కడ ఏ షో కి వెళ్లినా అభిమానులు దాన్ని కొట్టేయాలనుకుంటున్నారట. ఇటీవల మియామీ మ్యూజిక్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేశాడు ఉజివర్ట్. అప్పుడు దీన్ని తీసేయడానికి అభిమానులు ప్రయత్నం చేశారు. అభిమానుల్లోకి వెళ్లగానే దాన్ని లాక్కోవాలని కొంతమంది చూడటంతో వెంటనే వెనక్కు వచ్చేశాడు. డైమండ్ పోలేదు, నా తలపైనే ఉందంటూ ఓ వీడియో విడుదల చేశాడు. ఇప్పుడు ఉజి వర్ట్ కి ఇదో పెద్ద సమస్య అయింది.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్