భర్త హత్యకేసులో , భార్యకు , ఆమె బావకు యావజ్జీవం..

  0
  723

  బావతో అక్రమసంబంధంతో , కట్టుకున్న మొగుడిని చంపేసిన నీచురాలు , ఆమె బావ మరో ఇద్దరికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. గుంటూరు జిల్లాకు చెందిన పొనుపాడు గ్రామానికి చెందిన నరేంద్ర అనే , తన సమీప బంధువుని పెళ్లాడింది. ఆమె ప్రయివేట్ స్కూల్లో టీచర్ గా ఉంది. నరేంద్ర ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. పెళ్ళికి ముందునుంచే శ్రీవిద్యకు , తన అక్కభర్త గొట్టిపాటి వీరయ్య చౌదరితో అక్రమసంబంధం ఉంది. ఈ విషయం అక్కకు కూడా తెలుసు. రాత్రిళ్ళు సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వాడికే ఇచ్చి పెళ్ళిచేస్తే తమ అక్రమసంబంధం సాఫీగా కొనసాగుతుందనే , శ్రీవిద్య , ఆమె బావ ఈ కుట్ర చేశారు. ఈ విషయం శ్రీవిద్య , భర్త నరేంద్రకి తెలిసింది.

  దీంతో ఇంట్లో గొడవ మొదలైంది. భర్తను వదిలించుకోవాలని శ్రీవిద్య , బావ గొట్టిపాటి వీరయ్య చౌదరితో కుట్రచేసింది. అక్క ఇంటికి నరసరావుపేటకు చేరుకుంది. భర్తకు , బావతో ఫోన్ చేయించింది. నరసారావు పేటలోని , బార్ అండ్ రెస్టారెంట్ కి రప్పించింది. నరేంద్రచౌదరి , స్నేహితులు చౌడయ్య, బాలరాజు, ని కూడా ఒక పధకం ప్రకారం , నరేంద్రతో , బార్ లో తాగించారు. తరువాత ముగ్గురూ కలిసి బాకీ వసూలు నిమిత్తం తమతో మార్కాపురం రావసిందిగా నరేంద్రను కోరారు.

  కారులో వినుకొండ వైపు బయలుదేరారు. మార్గమధ్యలో , సైనేడ్ కలిపిన డ్రింక్ తాగించి , చంపేశారు. అది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు , పక్కనే పురుగులమందు టిన్ పెట్టారు. ఐతే , నరేంద్ర తండ్రికి అనుమానం రావడంతో , పోలీసు దర్యాప్తులో కుట్రమొత్తం బయటపడింది. దీంతో కోర్టు కిరాతక భార్య శ్రీవిద్యకు , బావ వీరయ్య చౌదరికి , సహకరించిన ఇద్దరికీ యావజ్జీవ శిక్ష విధించింది..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.