నాలుగు గ్రహాలు ఒకే లైన్లో , వేకువనే చూడొచ్చు..

  0
  43

  సౌర వ్యవస్థలో ఒక అద్భుతం ఆవిష్కృతమవుతోంది. నాలుగు గ్రహాలు ఒకే క‌క్ష్య‌లోకి రానున్నాయి. ఆకాశంలో నాలుగు గ్రహాలు ఒకే క్ర‌మంలో కనిపించడం అరుదైన ఘ‌ట‌న‌. కుజ‌, గురు, శుక్ర‌, శ‌ని గ్ర‌హాలు ఒక కక్ష్య‌లోకి వ‌చ్చే అపురూపమైన దృశ్యం ఆకాశంలో కనువిందు చేయనుంది. సూర్యోద‌యం స‌మ‌యంలో ఆకాశం నిర్మ‌లంగా ఉన‌ప్పుడు ఈ అరుదైన దృశ్యాన్ని క‌న్నులారా చూడొచ్చు. టెలిస్కోప్‌తో ఇంకా క్లియ‌ర్‌గా చూడొచ్చు. ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచి కుజ‌, శుక్ర‌, శ‌ని గ్ర‌హాల‌ను తెల్ల‌వారుజామున చూడ‌చ్చు.

  ఈనెల ద్వితియార్ధంలో ఈ మూడు గ్ర‌హాల‌కు తోడు గురు గ్ర‌హాన్ని క‌లిపి చూడ‌చ్చు. ఎందుకంటే గురు గ్ర‌హం కూడా ఈ మూడు గ్ర‌హాలతో పాటు అదే క‌క్ష్యంలోకి చేరింది. దీంతో నాలుగు గ్ర‌హాలు ఒకే అలైన్‌మెంట్‌లో క‌నిపిస్తున్నాయి. మే 1వ తేదీ వ‌ర‌కు ఈ అద్భుతాన్ని ఆకాశంలో వీక్షించ‌వ‌చ్చు. ఇది చాలా అరుదైన ఘ‌ట‌న‌గా నాసా పేర్కొంది. నాలుగు గ్ర‌హాలు ఒకే క‌క్ష్య చేర‌డం… ఒక అద్భుతమ‌ని స్ప‌ష్టం చేసింది. ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి ఉన్నవారు, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించేవారు ఆకాశంలో ఈ కలయికను వీక్షించవచ్చని సూచించింది.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.