కూతురు పెళ్లి కోసం జస్పాల్ అనే ఆ పేద తండ్రి 15 ఏళ్ళు కష్టపడి డబ్బు కూడగట్టుకున్నాడు.. బిడ్డ మన్ప్రీత్ పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాడు.. అన్నీ రెడీ చేసుకున్నాడు.. ఇంతలోనే కరోనా మహమ్మారి ముంచుకొచ్చింది.. తండ్రిని కబళించింది..
మరో వారంలో పెళ్లి ఉందనగా తండ్రి ఆరోగ్యం క్షీణించింది.. జీవితకాలం గంటల్లోకి వచ్చింది.. దీంతో కూతురు ఓ నిర్ణయం తీసుకుంది.. తన పెళ్లికోసం జీవితకాలం కష్టపడ్డ , తండ్రి జీవించి ఉండగానే , ఆయన చేత అక్షింతలు వేయించుకోవాలని నిర్ణయించుకుంది..
పెళ్ళికొడుకు కూడా ఒప్పుకున్నాడు.. దీంతో పెళ్లి ముహూర్తాన్ని ముందుకుజరిపి , పెళ్లి చేశారు.. భర్తతో కలిసి హాస్పిటల్ కి వెళ్లి , మృత్యుశయ్యపై ఉన్న తండ్రిచేత అక్షింతలు వేయించుకుంది.. తర్వాత నిమిషాల్లో తండ్రి తుదిశ్వాస విడిచాడు.. తృప్తిగా కన్నుమూశాడు.. చండీఘర్ లో జరిగిందీ ఘటన..