చచ్చిన కోడికి దశదినకర్మ.. ఊరంతా విందు..

  0
  379

  సెలవు రోజైనా , పెళ్లివేడుకైనా , బర్త్ డే అయినా , ఔటింగ్ అయినా , సందర్భంఏదైనా విందు అంటే కోళ్లు బలికావల్సిందే.. చికెన్ ముక్క నోట్లో పడాల్సిందే.. అయితే , ఒక కోడి చనిపోతే ఊరంతా విషాదంలో మునిగిపోయిందంటే మీరు నమ్ముతారా ..? ఆ కోడికి దశదిన కర్మ కూడా జరిగిందంటే నమ్మాల్సిందే.. ఎందుకంటే ఆ కోడి త్యాగం అలాంటిది.. ఇంతకీ ఈ విచిత్రం జరిగింది ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ ఘర్ జిల్లా , బెహడలకాల గ్రామంలో.. 13 రోజుల క్రితం ఈ గ్రామంలో లాలి అనే పేరుగల కోడిని యజమాని ప్రేమగా పెంచుకుంటున్నాడు.

  ఒక రోజు ఆ యజమానికి చెందిన పొట్టేలు పిల్లను వీధికుక్క వెంబడించి చంపేందుకు దాడిచేశాయి. వీధికుక్కను , లాలీ కోడి అడ్డుకుంది. దానిపైకి ఎగిరెగిరి పొడిచింది. పొట్టేలు పిల్ల జోలికి రాకుండా చేసింది. దీంతో పొట్టేలు పిల్ల ఇంట్లోకి పోయినా , అప్పటికే అక్కడున్న మిగిలిన కుక్కలు కోడిపై దాడిచేసి దానిని చంపేశాయి. తన పొట్టేలుపిల్లను కాపాడేందుకు , పెంపుడు కోడి ప్రాణాలు పణంగా పెట్టడంతో , యజమాని , దానిని ఇంటిపక్కనే పూడ్చి పెట్టాడు. 10 రోజుల తరువాత దాని జ్ఞాపకంగా ఫొటో పెట్టి , ఊరందరికీ శాకాహార విందు పెట్టాడు. కోడి అంత్యక్రియలకు , 500 మందివరకు హాజరయ్యారు.. కోడిని పూడ్చిపెట్టిన చోట సమాధికట్టి , దాని విగ్రహంకూడా పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.