నెల్లూరులో ఈవెనింగ్ షోస్.. ఇవే..

  0
  67

  సరిలేరు నీకెవ్వరు, వకీల్ సాబ్, అలవైకుంఠ పురంలో.. ఈ సినిమాలన్నీ ఈవెనింగ్ షోస్ గా ప్రదర్శిస్తారంటూ ట్వీట్ చేశారు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు. అదేంటి.. సినిమా హాళ్లన్నీ మూసి వేసిన ఈ టైమ్ లో సినిమాలెక్కడ చూపిస్తారనుకుంటున్నారా..? ఇది అందరికీ కాదు. కేవలం కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న వారికి మాత్రమే. కొవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న వారిలో ఒత్తిడి తగ్గించేందుకు ఇలా సినిమాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం ఈ మూడు సినిమాలు ప్రదర్శిస్తామంటూ స్వయంగా కలెక్టర్ ట్వీట్ చేయడం విశేషం. సినిమాలతోపాటు యోగా, ఆటలు, ఆరోగ్య సలహాలు, క్విజ్ లాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఐసోలేషన్ లో కరోనా బాధితులు ఇంటి వద్దే ఉన్నట్టు సౌకర్యవంతంగా ఫీల్ అయ్యేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు కలెక్టర్ చక్రధర్ బాబు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు