లవర్ తో లేడీ డాన్ అనూరాధ‌ అరెస్టు.

  0
  5260

  లేడీ డాన్ గా పేరున్న అనూరాధ‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాలాజ‌తేది అనే గ్యాంగ్ స్ట‌ర్ తో క‌లిపి ఆమెను అరెస్టు చేశారు. ఆమెపై 7 ల‌క్ష‌ల రివార్డు కూడా ఉంది. అనూరాధకు రాజ‌స్థాన్‌లో లేడీ డాన్ అనే పేరుంది. అనేక హ‌త్య‌లు, కిడ్నాప్‌లు, దందాలు, ల్యాండ్ మాఫియా కేసుల్లో ఆమె నిందితురాలు. రెండేళ్ళ క్రితం ఆమెకు జైలు శిక్ష ప‌డినా, పోలీసుల‌ను త‌ప్పించుకుని తిరుగుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు భ‌యంక‌ర‌మైన గ్యాంగ్ స్ట‌ర్ల‌తో క‌లిసి నేరాలు చేస్తోంది.

  ఆరేళ్ళ క్రితం వ‌ర‌కు ఆనంద‌పాల్ అనే గ్యాంగ్ స్ట‌ర్‌తో క‌లిసుండేది. అత‌డితో పాటు పాల్స్ గ్యాంగ్‌కు రాణిగా నేర‌సామ్రాజ్యాన్ని స్థాపించింది. ఆనంద్ పాల్‌ను ఎన్‌కౌంట‌ర్‌లో చంపేసిన త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు గ్యాంగ్ స్ట‌ర్ల‌తో క‌లిసి మ‌ళ్ళీ నేర‌సామ్రాజ్యం స్థాపించింది. ఇటీవ‌ల కాలాజ‌తేది అనే గ్యాంగ్ స్టర్ తో క‌లిసి స‌హ‌జీవ‌నం చేస్తూ, అత‌ని మాఫియా గ్యాంగ్‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. రాజ‌స్థాన్‌లో పోలీసుల వేట ఎక్కువ కావ‌డంతో ఢిల్లీలో త‌ల‌దాచుకుంటోంది. అయితే పోలీసులు ఆమె కోసం గాలిస్తున్న స‌మ‌యంలో, అనూరాధ‌తో పాటు కాలాజ‌తేది కూడా ప‌ట్టుబ‌డ్డాడు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?