లేడీ కానిస్టేబుల్ కన్నేస్తే.. ఏ బైక్ అయినా క్షణాల్లో మాయం..

    0
    182

    ఆమె ఓ హెడ్ కానిస్టేబుల్. అది కేవలం వృత్తి మాత్రమే. ప్రవృత్తి మాత్రం దొంగతనం. అక్కడా ఇక్కడా ఎందుకు ఏకంగా డిపార్ట్ మెంట్ సొమ్మునే దోచేస్తే పోలా అనుకుంది. సీజ్ చేసిన వాహనాల లెక్కలు రాసే పని ఆమెకు అప్పజెప్పడంతో దొంగకు దాళం చెవి అందించినట్టయింది. ఇంకేముంది సీజ్ చేసిన బండి స్టేషన్ కి వస్తే, దాన్ని రోజుల వ్యవధిలో దొడ్డి దారిన తరలించేస్తుంది. దీనికోసం ఓ వాహనాల డీలర్ తో ఆమె బేరం కుదుర్చుకుంది. అసలు ఓనర్ వస్తే, దాన్ని స్క్రాప్ కింద పడేశామని చెబుతోంది. ఈ వ్యవహారం బయటపడటంతో ఇప్పుడామెపై కేసు నమోదైంది.

    మహారాష్ట్రలోని వసాయి పోలీస్‌ స్టేషన్‌ లో స్టోర్‌ క్లర్క్‌ గా పని చేస్తున్న లేడీ హెడ్ కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్‌ సీజ్‌ చేసిన వాహనాలను అమ్ముకుంటూ పట్టుపడింది. దీనికి సంబంధించి వసాయి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించారు. లైసెన్స్, ఆర్సీ ఇతర పత్రాలు లేకపోతే పోలీసులు వాహనాలు సీజ్ చేస్తుంటారు. అలా సీజ్‌ చేసిన వాహనాలను, వస్తువులను, నగదుకు సంబంధించి వివరాలు నమోదు చేసుకోవడం ఆమె బాధ్యత.

    కానీ ఓ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా వాహనాలను, వస్తువులను బేరానికి పెట్టి విక్రయిస్తోంది. ఈ విషయంపై పలు ఆరోపణలు రావడంతో పోలీసులు రెక్కీ నిర్వహించి, స్క్రాప్ డీలర్ ముస్తాక్‌ కు విక్రయించే సమయంలో గైక్వాడ్‌ ను రెడ్‌హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. దాదాపు ఇప్పటి వరకు రూ.26 లక్షల విలువైన వస్తువులు, వాహనాలు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. స్క్రాప్ డీలర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. మార్చి 12న లేడీ హెడ్‌ కానిస్టేబుల్‌ ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. ఆమెపై వసాయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?