ఇద్ద‌రు మ‌హిళ‌లు మ్యాన్ హోల్స్ లో..

  0
  268

  మ్యాన్ హోల్.. ఇందులో ప‌డితే న‌ర‌కానికి కాలింగ్‌ బెల్ కొట్టిన‌ట్లే. చినుకు ప‌డితే చాలు మ్యాన్ హోల్స్… మృతువులా క‌బ‌ళించేందుకు రెడీగా ఉంటాయి. పొర‌పాటున ఇందులో ప‌డ్డారంటే… పాస్ పోర్ట్, వీసా లేకుండా య‌ముడి ద‌గ్గ‌రికి వెళ్ళిన‌ట్లే. దేశంలో ఎక్క‌డ చూసినా ఇదే ప‌రిస్థితి. ఇటీవ‌ల ముంబైలో భారీ వ‌ర్షాలు కురిసాయి. ఈ వ‌ర్షాల కార‌ణంగా మ్యాన్ హోల్ మూత‌లు కొట్టుకుపోయాయి. అయితే వ‌ర్షంలో త‌డుస్తూ వెళుతున్న ఇద్ద‌రు మ‌హిళ‌లు మ్యాన్ హోల్స్ లో ప‌డిపోయారు. 30 సెక‌న్ల వ్య‌వ‌ధిలో ఈ రెండు ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే మ్యాన్ హోల్ సైజు చిన్న‌వి కావ‌డం వ‌ల్ల‌నో… లేక మ‌హిళ‌లు కాస్త లావుగా ఉండ‌డం వ‌ల్ల‌నో… మ్యాన్ హోల్ మ‌ధ్య‌లో ఇరుక్కు పోయారు. అతిక‌ష్టం మీద శ‌క్తిని కూడ‌గ‌ట్టుకుని ఆ మృత్యు లోయ‌లో నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ స‌మీపంలో ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు కావ‌డంతో… ఈ ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌చ్చాయి. అదే చిన్న‌పిల్ల‌లు, స‌న్న‌నివాళ్ళు అయ్యుంటే.. మ్యాన్ హోల్స్ కి బ‌లి అయ్యేవాళ్ళు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..