బజ్జీలు తిందామని పబ్ కెళ్ళా.. కుషిత చెప్పింది..

  0
  1389

  ఒకాయనేమో పబ్ కి వెళ్లిన తనకూతురు రాత్రి 2 వరకు , పబ్ లోనే ఉన్నా , డ్రగ్స్ , లిక్కర్ తీసుకోలేదంటాడు.. జస్ట్ ఫ్రెండ్స్ తో ఉన్నదంటాడు.. మరొకాయనేమో తనకొడుకు ఉగాదికదా , అందుకని పబ్ కి వెళ్ళాడు అంటాడు.. మరొకడేమో , మా అమ్మాయి ఉగాది అని పబ్ లో సెలెబ్రేట్ చేసుకుంది అంటాడు.. మరొక అమ్మాయేమో జస్ట్.. పబ్ లో బజ్జీలు తిందామని పోయానండి.. అదీకూడా పబ్ మూసేముందు , అంటే రాత్రి రెండు గంటలకు బజ్జీలు తిందామని పోయిందట.. ఇలా చెప్పినమ్మాయి పేరు కుషిత.., షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తుందని చెబుతున్నారు..

  అయితే ముంబయిలో మాదిరి , పబ్ లో దొరికినవాళ్ళందరికీ , పోలీసులు బ్లెడ్ టెస్టులు చేయించలేదు. ఎందుకో తెలియదు.. డ్రగ్ దొరికినప్పుడు , అక్కడున్నవారికి డ్రగ్ సేవించారా లేదా అన్న విషయం తేలేందుకు అందరికీ టెస్ట్ లు చేయించాలి.. అందులో పబ్ లో డ్రగ్స్ దొరికినప్పుడు ఇలా చెయ్యాల్సిందే.. కానీ అదేమీ చేయలేదు.

  డ్రగ్స్ అమ్మడం ఎంతనేరమో , తీసుకోవడం కూడా అంతే నేరం.. కానీ హైద్రాబాద్ పబ్ విషయంలో రాజకీయ , సినీ ప్రముఖుల పిల్లలు ఉండటంతో , విచారణలో జాప్యం జరిగి , సమస్య అంతా , పబ్ ఎవరిది ..? అంతసేపు ఎందుకు ఓపెన్ చేసారు.. ? అన్న అంశంపై చర్చ జరిగి , అసలు విషయం పక్కకు పోయింది.. అందుకే , ఒకరు బజ్జిలకు పబ్ కు పోయామంటే , మరొకరు ఉగాది వేడుకలకని చెప్పి , చెవుల్లో పూలు పెడుతున్నారు..

  https://www.facebook.com/watch/?v=394110132554557&ref=sharing

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.