జగన్ , కేటీఆర్ మధ్య షర్మిల హీట్ పెంచిందా..??

  0
  184

  సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ని మరో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయంగా విమర్శలు చేసుకుంటారు , పార్టీపరంగా దుమ్మెత్తిపోకుంటారు. అయితే ఆ రాష్ట్రం బాగాలేదని , అక్కడ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శలు చేయడం దాదాపుగా అరుదుగానే జరుగుతుంటుంది . ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ , ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాదులో జరిగిన క్రెడాయ్ పెట్టుబడుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని అందువల్ల పెట్టుబడులకు , వ్యాపారాలకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన అని చెప్పుకొచ్చారు . ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు లేదని ,నీళ్లు లేవని ,రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని ఇటువంటి పరిస్థితులు తెలంగాణలో లేవని తమ రాష్ట్రం చాలా బాగుందని అన్నారు.

  పక్క రాష్ట్రం గురించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ,రెండు రాష్ట్రాల మధ్య బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణకు వస్తే రిలీఫ్ గా ఫీలవుతుందని చెపుతున్నారు అని కూడా కేటీఆర్ అన్నారు. కేటీఆర్ , కేసీఆర్ , జగన్ 12నెలల క్రితం వరకు సంబంధాలు బాగానే ఉండేవి . ఇద్దరూ ఒకరికొకరు పొగుడుకునేవారు. అయితే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్ ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిన తిరుగుతోంది . పాదయాత్రలో కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. దీంతో సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే క్రెడాయ్ సమావేశంలో పక్క రాష్ట్రంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి అని , అసలు పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులుకు కానీ అది అనుకూలమైన రాష్ట్రం కాదని అంటూ దుమ్మెత్తి పోయడం విశేషం . దీన్ని ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.. ??

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.