12 ఏళ్ళ అమ్మాయికి వెన్నెముక ఇలా..

  0
  395

  కూతురు భుజం నొప్పి అని చెప్తుంటే తల్లి అదేదో నెట్ బాల్ ఆడే టప్పుడు కలిగిన నొప్పి అనుకుంది.. లేదా కూతురు హార్స్ రైడింగ్ చేసేటప్పుడు ఏదైనా నొప్పి కలిగింది అని భావించింది .. అయితే ఉదయానికి తట్టుకోలేని భుజం నొప్పితో కూతురు అల్లాడిపోయింది. తల్లి ఏం జరిగిందో చూడకుండా అదేదో మామూలు నొప్పి అనుకొని టాబ్లెట్ వేసింది .

  ఆ తర్వాత కూతురు స్విమ్మింగ్ కి రెడీ అవుతుంటే స్విమ్మింగ్ సూట్ వీపు భాగంలో వేసేప్పుడు వెన్నెముక మార్పును గమనించి భయపడిపోయింది. రాత్రి సంతోషంగా నిద్రపోయినా కూతురు ఉదయానికి ఇలా ఎందుకు అయిందని ఆందోళన చెందింది. డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తే ఒక ఆశ్చర్యకరమైన నమ్మలేని నిజాన్ని బయటపెట్టారు .

  రాత్రికి రాత్రి ఆ బాలికకు వెన్నుముక 80 డిగ్రీల పక్కకు పోయిందని చెప్పారు. ఎక్స్ రే చూసిన తర్వాత దాన్ని నిర్ధారించారు . ఇలా జరగడం ప్రపంచంలో అరుదైన సంఘటన . దీంతో పన్నెండేళ్ల బాలిక స్కోలియాసిస్ అనే వ్యాధితో బాధపడుతోందని డాక్టర్లు తేల్చి చెప్పారు . ఇది కొంతకాలంగా ఉన్నప్పటికీ గమనించలేకపోయారు . వెన్నెముక 80 డిగ్రీల వంపు ఉండడం మాత్రం ఒక రాత్రిలోనే జరిగిపోయిందని డాక్టర్లు తెలియజేశారు.

  వెన్నెముక ఇలా ఒంపులు తిరిగి ఇంకా పక్కకు జరుగుతుందని ఇలా జరిగితే అమ్మాయి ఊపిరితిత్తులు ,గుండెపై ఒత్తిడి పెరిగి ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పారు . దీంతో అమ్మాయి ఆపరేషన్కు అంతా సిద్ధం చేశారు. వెన్నుముక వంగిపోవడం అనేది కాలక్రమేణా జరిగే విషయం అయినా , 12 ఏళ్ళ బాలికకు రాత్రికి రాత్రి ఇలా 80 డిగ్రీలకు వంగిపోవడం మాత్రం విచిత్రం..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.