కొడాలి నానీ ,, నిన్ను వదలనంటే , వదలను..అన్నట్టయింది సీఎం జగన్ మనసు. నానికి ఏకంగా స్టేట్ డెవెలెప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చేశాడు. మంత్రి పదవికి రాజీనామాలు ఆమోదంపొంది 24 గంటలు కాకముందే ఆయనకు క్యాబినెట్ హోదాతో పదవి ఇచ్చేశారు. ఈ పదవి ఇంతకుముందు కార్పొరేషన్ల మాదిరిగానే నామమాత్రం అయినా , పేరుకు మాత్రం రాష్ట్ర అధివృద్ది బోర్డు చైర్మన్ పదవి.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా , కొడాలి నాని , ఏమిచేశారన్న విషయం పక్కనపెడితే , కృష్ణా జిల్లా టీడీపీ నాయకులను , చంద్రబాబుని , లోకేష్ ని , చిత్ర , విచిత్రమైన తిట్లతో ఒక ఆట ఆడుకున్నారు.
కమ్మ సామాజికవర్గం మనోభావాల సంగతి ఎలా ఉన్నా , జగన్ కి , వీర విధేయుడిగా , అపర భక్తుడిగా ఆయన పాత్ర తిరుగులేనిది. తిట్ల దండకంలో , కొత్త ఒరవడిని సృష్టించాడు. అసలు చంద్రబాబుని తిట్టేందుకే , నాని మంత్రిగా ఉన్నారా అనిఅనుకునేంతగా ముద్రపడిపోయారు. నాని ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా , ఈ మూడేళ్ళలో , వేళ్ళమీద లెక్కపెట్టినన్ని సార్లే , తన శాఖ లోని విషయాలు చెప్పిఉంటారు.. మిగిలిన అన్ని దఫాలు తిట్లకే టైం కేటాయించేవారు.
ఆ తిట్లలో అంత బలం , హాస్యం , అపహాస్యం , కసి .. అన్నీ ఉంటాయి.. ముల్లుని , ముల్లు తోనే తీయాలన్న రాజకీయంలో , నాని , టిడిపిలో , కమ్మ నాయకులపై , ముఖ్యంగా చంద్రబాబు , లోకేష్ పై , విమర్శలకు బాగా పనికొచ్చాడు. మూడేళ్ళ పాలనలో కొడాలి నాని తిట్లు కూడా ఒక రికార్డే.. ఉన్న వైసీపీ నేతల్లో కొడాలి లాగా , టిడిపి నేతలను కొడవలితో నరికినట్టు తిట్టగల నేర్పు , ఆ తిట్ల వాగ్దాటి ఎవరికీ లేదు.. అందుకే , మంత్రి పదవికి రాజీనామాచేసి , అది ఆమోదం పొందిన 24 గంటల్లో అదే కాబినెట్ హోదాతో కొడాలి నానికి పదవి దక్కింది.. ఇక మళ్ళీ టిడిపి నేతలకు మళ్ళీ నిద్రలేని రాత్రులే , పడుకున్నా కలలో వినిపించే తిట్లే..