ఎగురుతున్న డ్రోన్ ను పక్షి అనుకున్న ఓ మొసలి లటుక్కున నోట్లో పట్టుకుంది. అంతటితో ఆగకుండా కరకరా నమిలేసింది. అయితే ఆ డ్రోన్ మొసలి నోటిలో పేలింది. అది పేలడంతో మొసలి నోటిలో నుంచి దట్టమైన పొగలు రేగాయి. ఇక నోటిలో గాయాలు కావడంతో ఆ మొసలి నానా తంటాలు పడింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఆవీడియో వైరల్ అవుతోంది.