కత్రినా పెళ్లి కోసం కలెక్టర్ , ఎస్పీ హై లెవెల్ మీటింగ్.. నమ్మండి.

  0
  2122

  బాలీవుడ్ హీరోయిన్‌ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌషల్ ఒకింటి వారు కాబోతున్నారు. కొన్ని నెల‌ల క్రితం వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ సీక్రెట్ గా జ‌రిగింది. అది జ‌రిగిన కొన్ని రోజుల‌కి నిశ్చితార్ధం జ‌రిగింద‌ని అంద‌రికీ తెలిసింది. ఇప్పుడు పెళ్ళి తేదీ ద‌గ్గ‌ర ప‌డుతోంది. డిసెంబ‌ర్ 7,8,9 తేదీల్లో రాజస్థాన్‌లోని బ‌వారా ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరగనుంది. ఈ పెళ్ళి వేడుక‌ను అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపేందుకు విక్కీ-కైఫ్ ప్లాన్ చేస్తున్నారు.

  ఇదిలావుంటే, రాజస్తాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లా కలెక్టర్ రాజేష్ కిష‌న్ .. క‌త్రినా, విక్కీల పెళ్ళిపై అత్యుత్సాహం చూపిస్తున్నారు. వీళ్ల పెళ్లికి అరేంజ్‌మెంట్స్‌, సెక్యూరిటీ ఇత‌ర‌త్రా అంశాల‌పై స్పెష‌ల్ మీటింగ్ పెట్టారు. ఎస్పీ రాజేష్ సింగ్, జాయింట్ క‌లెక్ట‌ర్, మ్యారేజ్ ఈవెంట్ ప్ర‌తినిధులు, హోట‌ల్ స్టాఫ్ తో చ‌ర్చించడం హాట్ టాపిక్ అయింది. సంగీత్‌, మెహందీ, మ్యారేజ్ కోసం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి ? ఎలాంటి భ‌ద్ర‌త‌లు చేప‌ట్టాలి ? ఎంత సెక్యూరిటీ నియ‌మించాలి ? అందుకు కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేయాలి ? వంటి అంశాల‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్ష నిర్వ‌హించ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.