కరోనా భయంతో మిమ్మల్ని చంపేస్తున్నా.డాక్టర్

  0
  1325

  కరోనా ఒమిక్రాన్ భయంతో ఓ డాక్టర్ తనకుటుంబం మొత్తాన్ని చంపేశాడు. యూపిలోని కాన్పూర్ లో ఈ ఘోరం జరిగింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వస్తే మీరెవరూ బ్రతకరని చంపేశాడు. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వ్యక్తి.. మొదట తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత కొడుకు, కూతురును కూడా ఇనుప రాడ్డుతో తలపగలగొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోతూ తన సోదరుడికి వాట్సాప్ లో మెసెజ్ పెట్టాడు.

  హాస్పిటల్లో కరోనాతో చనిపోతున్న శవాలకు పోస్టు మార్టం చేయలేక.. శవాలను లెక్కపెట్టలేక విసిగి పోయాయని.. ఒమిక్రాన్ తో విసిగి.. కుటుంబ సభ్యులను చంపేశానని మెసేజ్ లో వివరించాడు. వాట్సాప్ మెసేజ్ చూసి సోదరుడి ఇంటికి వెళ్లిన ఆ వ్యక్తి.. అక్కడి దృశ్యాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ హత్యలకు పాల్పడిన డాక్టర్ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని తెలుస్తోంది. గతంలోనూ తన భార్యను చంపాలని అనుకున్నట్టు డైరీలోనూ రాసుకున్నాడు. ఇప్పుడు నేను శవాలను లెక్కించాల్సిన అవసరం లేదని కూడా రాసుకున్నాడు. బహుశా ఈ డాక్టర్ కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.