ప్రకాశం జిల్లా టంగుటూరులో తల్లీ కూతుళ్ల హత్య కలకలం రేపింది. స్థానికంగా నివసించే రవి కిశోర్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా బంగారం వ్యాపారం చేస్తున్నారు. భార్య శ్రీదేవి, కుమార్తె లేఖనతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ తల్లీ కూతుళ్లిద్దరూ ఇంట్లో శవాలై కనిపించారు.
షాపు నుంచి గత శుక్రవారం ఇంటికి తిరిగొచ్చి చూసిన రవికుమార్ .. ఇంట్లో విగతజీవులుగా పడిఉన్న భార్యాకూతురును చూసి షాక్ కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లీ కూతుళ్ళిద్దరినీ గొంతు కోసి అత్యంత దారుణంగా చంపడం టంగుటూరులో కలకలం సృష్టించింది. పోలీసులు ఈ హత్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.