కార్తీకదీపం సీరియల్ మరో నాలుగేళ్లు..

  0
  221

  వంటలక్క, డాక్టర్ బాబు, కార్తీక దీపం. ఈ పేర్లు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. సీరియల్స్ చూసే వాళ్లంతా కార్తీక దీపం వస్తే టీవీలను అతుక్కుపోతారు. 2017 అక్టోబర్ నెలలో మొదలైన కార్తీకదీపం ఇంకా సక్సెస్ ఫుల్ గా కొనసాగడం విచిత్రమే. అయితే మూడున్నరేళ్ల ఈ సీరియల్ మరో నాలుగేళ్లపాటు కంటిన్యూ అవుతుందనే వార్త మాత్రం కాస్త విడ్డూరం.

  అవును కార్తీక దీపం మరో నాలుగేళ్లపాటు కొనసాగుతుందని అంటున్నారు నిర్మాతలు. ఈ సీరియల్ నటీమణులతో నిర్మాత సాగించిన చిట్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  https://www.instagram.com/tv/CNDC0yOH3lK/?utm_source=ig_web_copy_link

  మలయాళం కరుతముతూ సీరియల్ ఆధారంగా రూపొందిన కార్తీకదీపం సీరియల్ 2017 అక్టోబర్ నెలలో ప్రారంభమైంది. కన్నడలో ముద్దులక్ష్మి, తమిళ్‌లో భారతి కనమ్మ, మరాఠీలో రంగ్ మాజ వేగల పేరుతో ఈ సీరియల్ నిర్విరామంగా ప్రసారం అవుతూనే ఉంది. ఇక తెలుగు విషయాలని వస్తే.. ఈ సీరియల్ మొదలై మూడేళ్లు దాటింది. ఈ ఏడాది అక్టోబర్ కి కార్తీక దీపం కి నాలుగేళ్లు పూర్తవుతాయి.

  కార్తీకదీపం 1000 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న సందర్భంగా వంటలక్క ప్రేమి విశ్వనాథ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో కార్తీకదీపం నిర్మాతతోపాటు, మోనిత (శోభా శెట్టి) కూడా ఉన్నారు. వీరి మధ్య సాగింది సరదా సంభాషణే అయినా.. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ సీరియల్ ని మరో నాలుగేళ్లపాటు నడిపించే ఉద్దేశం నిర్మాతకు ఉన్నట్టు అర్థమవుతోంది.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే.