RRR సినిమాను బహిష్కరించండి.. కర్ణాటకలో ట్విట్టర్ వార్.

    0
    195

    యావ‌త్ సినీప్రియులు ప్ర‌స్తుతం ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. మార్చి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టి నుంచే అభిమానులు హంగామా చేస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ స‌హా హేమాహేమీలు న‌టిస్తున్నారు.

    ఇటీవ‌లే క‌ర్నాట‌క‌లోని చిక్ బ‌ళ్ళాపూర్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వ‌హించారు. సీఎం బ‌స‌రాజ్ బొమ్మై హాజ‌రై… ఈ చిత్రాన్ని ఆకాశానికెత్తేశారు. ఇదిలావుంటే .. మ‌రి కొన్నిగంట‌ల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న నేప‌ధ్యంలో క‌న్న‌డిగుల‌కు ఆర్.ఆర్.ఆర్. టీమ్‌పై అంతులేని కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. త‌మ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని బహిష్కరించాలని కన్న‌డ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

    అందుకు కార‌ణం.. క‌న్న‌డ భాష‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌క‌పోవ‌డ‌మే. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఆర్.ఆర్.ఆర్. చిత్రం విడుద‌ల‌వుతోంది. అయితే క‌న్న‌డ భాష‌లో విడుద‌ల చేయ‌క‌పోవ‌డంపై క‌న్న‌డిగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది త‌మ భాష‌ను ఒక‌ర‌కంగా అవమానించడమేనని మండిప‌డుతున్నారు.

    క‌న్న‌డ‌ భాష‌లో ఆ సినిమా విడుద‌ల కాన‌ప్పుడు, ఇత‌ర భాష‌ల్లో ఎందుకు విడుద‌ల చేయాలంటూ నిల‌దీస్తున్నారు. ఆ చిత్రాన్ని క‌ర్ణాట‌క‌లో నిషేధం విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆర్.ఆర్.ఆర్ టీమ్ త‌ల‌లు ప‌ట్టుకుంటోంది.

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..