చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఈ ముగ్గురూ కర్ణాటక పోలీస్ శాఖకు చెందిన అధికారులు. ఒక కేసు విచారణ విషయమై ఆరుగురు పోలీసు అధికారులు తిరుపతికి వస్తున్నారు. వీళ్ళు ప్రయాణిస్తున్న కారు , పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలం పి.కొత్తకోట అండర్ బ్రిడ్జి వద్ద , ఒక స్తంభానికి గుద్దుకుంది. తరువాత బోల్తా పడి , ఇవతల రోడ్లో పడింది.
కారు వేగంగా వస్తుండటంతో , ప్రమాదానికి గురైనప్పుడు రెండు ముక్కలైంది. ప్రమాదంలో కర్ణాటక పోలీస్ ఎస్సై అవినాష్ , కానిస్టేబుల్ అనిల్ , కారు డ్రైవర్ ఉన్నారు. మరో ఎస్సై దీక్షిత్ , కానిస్టేబుళ్లు శరవణ , బసవ చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి పరిశీలించారు..