వారం రోజులకే ప్రియుడిని వదిలి ఉండలేక

  0
  2457

  మహిళల్లో ఇంత రాక్షసత్వం ఉంటుందా..? కట్టుకున్న భర్తను , ప్రేమగా చూసుకునే భర్తను ప్రియుడితో సరసాలకోసం కిరాతకంగా చంపించి.. భార్య , బిడ్డ కోసం నెలరోజులు సెలవుపెట్టి ఇంటికొస్తే , రాత్రి తలపగలకొట్టి చంపింది.. ఇదంతా తనకంటే 12 ఏళ్ళ చిన్నవాడైన ప్రియుడుకోసం.. ఒకప్పుడు చిన్నప్పుడు తన అక్కదగ్గర ట్యూషన్ చెప్పించుకున్న వాడితో సరసాలకోసం.. ఆ నీచురాలు ఇలా చేసింది. శ్రీకాకుళం జిల్లా పోడూరు మండలం పిల్లలవలస గ్రామానికి చెందిన మురళికి , మధురవాడకు చెందిన మృదులతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది.

  మురళి ఎరిత్రా అనే దేశంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. పెళ్ళైన తరువాత ఇద్దరూ వెళ్లిపోయారు. వాళ్లకొక కొడుకు.. ఇటీవల కొడుకు ఆరోగ్యం బాగాలేదంటూ , మధురవాడలోనే ఇల్లు కొని , భార్యను , కొడుకుని ఇక్కడే ఉంచి తాను ఎరిత్రా లో పనిచేస్తున్నాడు. ఈ లోగా మృదులకు , 18 ఏళ్ళ వయసుండే హరిశంకర్ వర్మ తో పరిచయం కలిగింది. వాడు చిన్నప్పుడు మృదుల ఇంటికి , ఆమె అక్కదగ్గర ట్యూషన్ కి వచ్చేవాడు, పరిచయం కాస్తా , అక్రమసంబంధానికి దారి తీసింది. ఇంట్లో భర్తకూడా లేకపోవడంతో , ఆమె హరిశంకర్ తో , యథేచ్ఛగా తిరగసాగింది.

  ఈ లోగా విదేశాలనుంచి భర్త రావడంతో , వారంరోజులకే , ఆమె విరహంతో వేగిపోయి , ప్రియుడితో , భర్తను చంపే ప్లాన్ చేసింది. వరం క్రితం అర్ధరాత్రి , భర్త నిద్రపోతుండగా ఇంట్లోకి ప్రియుడిని పిలిపించింది. నిద్రపోతున్న భర్తను , మొదటి పెనంతో , తరువాత , కుక్కర్ తో మోది చంపేసింది. శవాన్ని ప్రియుడి సాయంతో ఊరి బయట వంతెన తుప్పల్లో వేశారు. మూడో రోజు వాసన వస్తుండటంతో , విషయం తెలిసిపోతుందన్న భయంతో , ఒక రాత్రి సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. తరువాత ఏమీ తెలియనట్టు తన భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే ఆమె చెబుతున్న కట్టుకధలపై అనుమానమొచ్చిన పోలీసులు , మొబైల్ ఫోన్ పరిశీలించగా , మొత్తం బండారం బయటపడింది.. దీంతో ఇద్దరినీ అరెస్టుచేసి జైలుకి తరలించారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.