ఎవడి పవర్ వాడిదే , తగ్గేదెలా..

  0
  2478

  నువ్వు తప్పుచేసి నన్నే ప్రశ్నిస్తావా ..?? నా బైక్ కి పేపర్లు లేవు , మరి నీ పోలీస్ స్టేషన్ కరెంట్ కు మీటర్ లేదుకదా ..అంటూ ఏకంగా పోలీసు స్టేషన్ కి , పవర్ కట్ చేసాడు ఒక లైన్ మెన్.. ఎవడి పవర్ వాడిది.. ఈ తమాషా యుపిలో జరిగింది. రాయ్ బరేలీ కి చెందిన భగవాన్ స్వరూప్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో లైన్ మన్ గా పనిచేస్తున్నాడు.

  స్వరూప్ తన బైక్ పై వెళుతుండగా, మోదీ సింగ్ అనే పోలీస్ ఇన్ స్పెక్టర్ ఆపాడు. స్వరూప్ బైక్ పత్రాలు చూపించాలని అడిగాడు.బైక్ పత్రాలు ఇంట్లో ఉన్నాయని , తెచ్చి చూపిస్తానని చెప్పినా ఆ పోలీస్ ఇన్ స్పెక్టర్ రూ.500 జరిమానా విధించాడు.దీంతో లైన్ మన్ స్వరూప్ ఆగ్రహానికి లోనయ్యాడు.

  తనకు ఫైన్ వేసిన పోలీసు అధికారి ఉండే పోలీస్ స్టేషన్ కు అక్రమంగా కరెంట్ వాడుకుంటున్నారని అతడికి తెలుసు. దీంతో తన పవర్ ఏమిటో చూపించాలనుకున్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కి కరెంట్ కట్ చేసి ఇది తన డ్యూటీ అని గుర్తు చేసాడు. సరైన పత్రాలు , కరెంట్ మీటరు ఉంటేనే , పవర్ ఇస్తానని చెప్పాడు.. మీటరు లేకుండానే పోలీసులు కరెంటు వాడుకుంటున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని దీని పైకూడా కేసునమోదు చెయ్యాలని కోరాడు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..