కర్ణాటక సి ఎం యడ్యూరప్ప రాజీనామా..

  0
  327

  క‌ర్నాటక ముఖ్య‌మంత్రి య‌డుయూర‌ప్ప రాజీనామా చేశారు. య‌డుయూర‌ప్ప చాలా బాగా ప‌ని చేస్తున్నార‌ని ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ప్ర‌క‌టించిన 12 గంట‌ల్లోనే య‌డుయూర‌ప్ప రాజీనామా చేశారు. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామా ప‌త్రం అందించ‌నున్నారు. గ‌త కొన్నిరోజులుగా బీజేపీలోనే య‌డుయూర‌ప్ప‌పై తిరుగుబాటు మొద‌లైంది. ప‌లు ద‌ఫాలు పార్టీ నేత‌లు ఢిల్లీ అధిష్టానానికి య‌డుయూర‌ప్ప‌ను మార్చాల‌ని, లేనిప‌క్షంలో పార్టీకి దూరం అవుతామ‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌ధ్యంలో క‌ర్నాటక రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషించే లింగాయ‌త్ సాధువులు య‌డుయూర‌ప్ప‌ను కొన‌సాగించాల్సిందిగా హైకమాండ్‌కు అల్టిమేటం కూడా ఇచ్చారు. అయితే విచిత్రంగా స‌మ‌స్య స‌మిసిపోయింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో య‌డుయూర‌ప్ప రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి బాంబు పేల్చారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?