టీవీ నటుడు కరణ్ మెహ్రా తన భార్య, సినీ టీవీ నటి నిషా రావల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. నా భార్య తన ఇంట్లోనే ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని, తనను మానసిక క్షోభకు గురి చేస్తోందని వాపోయాడు. కరణ్ మెహ్రా, నిషారావల్ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. గతేడాది కరణ్ మెహ్రాపై గృహ హింస, వివాహేతర సంబంధం కేసులు పెట్టి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది నిషా రావల్. కొన్నాళ్ళుగా జైలు జీవితం గడిపిన కరణ్ మెహ్రా బెయిల్ పై విడుదలై… మీడియా ముందు భార్య వల్ల పడ్డ బాధలను ఏకరవు పెట్టాడు.
నా భార్య నిషా… ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, తన ఇంట్లో వేరే గదిలో సరసాలు సాగిస్తసోందని చెప్పుకొచ్చాడు. విడాకుల కేసు కోర్టులో జరుగుతున్నా.. అవేవీ ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోందని వాపోయాడు. ఎక్కువ భరణం కోసం డిమాండ్ చేయడంతో పాటు తన వ్యాపారం, డబ్బు, కారు, బంగ్లా అన్నీ లాగేసుకోవడానికి ట్రై చేస్తోందన్నాడు. లవర్ తో ఎంజాయ్ చేయడం కోసం తనపై తప్పుడు కేసులు బనాయించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలావుంటే… కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ లాకప్ షో లో నిషా గతంలో ఓ సీక్రెట్‌ని బయటపెట్టింది. “చాలాకాలం తర్వాత నా పాత స్నేహితుడిని చూశాను. వెంటనే కనెక్ట్ అయిపోయాను. అప్పటికే చాలా బాధల్లో ఉన్న తనకు ఆ స్నేహితుడు అండగా నిలిచాడు. దీంతో అతనికి ఆకర్షితురాలినై ముద్దు పెట్టుకున్నాను. ఆ విషయం భర్త కరణ్ మెహ్రాకు కూడా చెప్పాను. అప్పటికే తము విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాము”. అని చెప్పుకొచ్చింది.