300 కోట్లు వచ్చింది.అప్పులు తీర్చేస్తా ..

  0
  332

  యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ స్వీయ నిర్మాణంలో న‌టించిన విక్ర‌మ్ సినిమా క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తోంది. తమిళనాడులోనే కాదు .. తెలుగు రాష్ట్రాల్లోను .. ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం సాధించిన విజ‌యానందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు క‌మ‌ల్. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించారాయ‌న‌.

  నిజానికి ఈ సినిమా ముందు వ‌ర‌కు చాలా అప్పుల్లో ఉన్నాన‌ని, కొన్నింటిలో పెట్టుబ‌డులు పెట్టి న‌ష్ట‌పోయాన‌ని చెప్పారు. నాలుగేళ్ళుగా సినిమాలు లేక ఇబ్బందులు ప‌డ్డాన‌ని తెలిపారు. ఆ స‌మ‌యంలో మ‌న‌స్పూర్తిగా, తృప్తిగా భోజ‌నం చేయ‌లేక‌పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ విక్ర‌మ్ సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతో త‌న సొంత బ్యాన‌ర్‌లోనే మూవీని నిర్మించాన‌ని చెప్పారు. ఈ సినిమా విజ‌యంతో నా క‌ష్టాల‌న్నీ తీరిపోయాన‌ని, ఇత‌రుల‌కు సాయం చేసే స్థితికి మ‌ళ్ళీ వ‌చ్చాన‌ని తెలిపారు. రెండు వారాల్లో 300 కోట్ల లాభం వ‌చ్చింద‌ని, ఈ విజ‌యాన్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేన‌న్నారు.

  విక్ర‌మ్ సినిమాకి క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇంత‌టి విజ‌యాన్ని అందించిన డైరెక్ట‌ర్ క‌న‌క‌రాజ్‌కు సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు క‌మ‌ల్. ఖరీదైన లెక్సాస్‌ లగ్జరీ కారును అందించారు. ఇక ఈ చిత్రంలో రోలెక్స్ పాత్ర‌లో గెస్టుగా న‌టించిన సూర్య‌కు.. కాస్ట్ లీ రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చి.. త‌న ఆనందాన్ని షేర్ చేసుకున్న విష‌యం తెలిసిందే.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..