ఎస్సై కూర్చునే కుర్చీలో కాలభైరవుడి ఫోటో ఉంటుంది.

  0
  1393

  ఓ పోలీస్ స్టేషన్లో ఎస్సై కోసం వేసిన కుర్చీలో ఎవరూ కూర్చోరు.. అంత ధైర్యం కూడా ఎవరికీ లేదు.. ఒక వేళ డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులు వచ్చినా ఆ ఎస్సై కోసం వేసిన కుర్చీలో కూర్చునేందుకు మాత్రం సాహసం చేయరు. ఆ కుర్చీ పక్కన మరో కుర్చీ వేసుకొని తమ పనులు చేసుకుంటారు. ఇదెక్కడో కాదు.. కాశీలోని విశ్వేశ్వర్ గంజ్ పోలీసు స్టేషన్ లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆచారం.. ఎందుకంటే ఆ స్టేషన్ లోని ఎస్సై కూర్చునే కుర్చీలో కాలభైరవుడి ఫోటో ఉంటుంది. కాశీని కాపాడే భాద్యత కాలభైరవ బాబాకే పరమశివుడు అప్పగించినట్టుగా చెబుతారు. కాలభైరవ బాబా ఫొటోకు పూజలు చేయనిదే.. పోలీసులు పనులు కూడా మొదలు పెట్టరు. ఎందుకంటే కాశీకి కాలభైరవుడే రక్షకుడని వారంతా భావిస్తారు. ఈ ఆచారం ఎప్పటినుంచో కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఆధారాల ప్రకారం 1715వ సంవత్సరంలో భాజీ రావు పీష్వాల్ కాలభైరవుడి ఆలయాన్ని నిర్మించాడు. కాశీకి ఏ అధికారి వచ్చినా ముందు ఆ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతనే విధులను స్వీకరిస్తారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?