తండ్రి చనిపోవడంతో ఓ యువతి కారుణ్య నియామకం కింద ఆఫీస్ లో చేరింది. అదే ఆఫీస్ లో పనిచేసే ఓ మహిళ ఆ అమ్మాయిని చూసి ఆకర్షితురాలైంది. ఇద్దరిది లెస్బియన్ ప్రేమ. కడప పట్టణంలోనే కలసి ఉండేవారు. కొన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ప్రేమ కార్యకలాపాలు కొనసాగించారు. రహస్యంగా కలుసుకునేవారు, సినిమాలు, షికార్లకు వెళ్లేవారు. హోటల్ రూమ్స్ లో గడిపేవారు. ఇద్దరూ అమ్మాయిలే కావడంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అయితే కొన్నాళ్లకు ఇద్దరికీ కలసి కాపురం చేయాలనే కోరిక కలిగింది. యువతికి మగ లక్షణాలు ఉండటంతో.. హిజ్రాగా మారమని సలహా ఇచ్చింది ఆ మహిళ. అలా మారితే వివాహం చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆ యువతి నిజంగానే హిజ్రాగా మారింది. మగలక్షణాలు కొనితెచ్చుకుంది. పెళ్లి చేసుకోడానికి సిద్ధపడింది.
కాదుపొమ్మన్న మహిళ..
యువతి హిజ్రాగా మారిన తర్వాత ఆ మహిళతో పాటు సెపరేట్ గా రూమ్ లో ఉంటూ వచ్చింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఇద్దరూ ఆలుమగలు లాగానే ఒకే ఇంట్లో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండానే ఒకేచోట ఉన్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత మహిళ ప్రవర్తనలో మార్పు వచ్చింది. హిజ్రాగా మారిన యువతి పెళ్లెప్పుడు అని అడుగుతుండే సరికి ఆ మహిళ ప్లేటు ఫిరాయించింది. ఇంట్లో ఒప్పుకోవడంలేదు పెళ్లి చేసుకోలేనని చెప్పింది. దీంతో యువతి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.
హిజ్రాగా మారిన యువతితో ప్రేమను వదులుకోలేక ఇబ్బంది పడుతోంది ఆ మహిళ. వీరిద్దరి వ్యవహారం చూసి మహిళ కుటుంబ సభ్యులు ఆమెను నిర్బంధించారు. వీరిద్దరి లెస్బియన్ ప్రేమను ఒప్పుకోలేక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. అటు పోలీసులు ఈ కేసు ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు.
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?