అల్లు అర్జున్ కూతురు అర్హ పై సమంత కామెంట్.

  0
  271

  అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కూతురు అర్హ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గుణశేఖర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో భ‌ర‌తుడు చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో ఆమె న‌టించ‌నుంది. ఈ విష‌యాన్ని అల్లు ఫ్యామిలీ, డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. టైటిల్ పాత్ర‌లో స‌మంత‌, దుష్యంతుడిగా మ‌ళ‌యాళ హీరో దేవ్ మోహ‌న్ న‌టిస్తున్నారు. అయితే శకుంత‌ల పాత్ర‌లో న‌టించే స‌మంత‌, అర్హ‌పై స్వీట్ కామెంట్స్ చేసింది.
  ‘శాకుంత‌లం’ చిత్రంలో ప్రిన్స్ భరతుడి పాత్రలో నటిస్తున్న అర్హ.. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ టీమ్ తో జాయిన్ అయింది. ప్రస్తుతం తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేస్తున్న అర్హ.. అప్పుడే స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు అందుకుంది. “ఆమె డైలాగ్స్ అన్నీ అర్థం చేసుకుని మొదటి టేక్ లోనే చెప్పేసింది. అల్లు కుటుంబంలో నటన వారసత్వంగా వచ్చిందని అర్హ నిరూపించిందని చెప్పింది. ఒక్క టేక్ లో సీన్ ఓకే చేస్తుందని ప్రశంసించింది. సూపర్ స్టార్ అవుతుంది. గాడ్ బ్లెస్ యు” అంటూ సమంత త‌న ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?