నన్ను చంపినా , నా దేవుణ్ణి వదిలిరాను..

  0
  52

  ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో రాజేష్ కుమార్ అనే ఓ హిందూ పూజారి ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్తాన్ లోని కాబూల్ నుంచి వేలాది మంది హిందువులు భారత్ కి వస్తున్నారు. సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడే పారిపోయాడు. అయితే కాబూల్ లోని రతన్ నాథ్ మందిర్ పూజారి రాజేష్ కుమార్ మాత్రం తన ప్రాణం పోయినా గుడిని, దేవుడ్ని వదిలిపెట్టి రానని, స్పష్టం చేశారు. ఆయనను తమతో తీసుకొచ్చేందుకు వందలాది మంది హిందువులు ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాబూల్ లో మిగిలిన ఏకైక హిందు దేవాలయ పూజారి రాజేష్ కుమార్ ఒక్కరే.

  తర తరాలుగా తమ కుటుంబీకులు స్వామివారి సేవలో ఉన్నారని, అందువల్ల దేవుడ్ని వదిలి తాను భారత దేశానికి పారిపోలేనని, తాలిబన్లు చంపినా ఇక్కడే చనిపోతానని రాజేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆప్ఘనిస్తాన్ ను ఇస్లామిక్ రాజ్యంగా చేస్తామని తాలిబన్లు ఇదివరకే ప్రకటించారు. అంటే, అక్కడ గుడి ఉండేందుకు ఇక వీలు లేదు. ముస్లింలు కాకుండా ఏ ఇతర మైనార్టీలు ఉన్నా, ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. అన్ని మతస్తుల నివాసం కింద జిజియా అనే పద్ధతిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దేవుడి మీద తర తరాలుగా తాము నమ్ముకున్న గుడిమీద రాజేష్ కుమార్ విశ్వాసాన్ని నిజంగా గొప్పదిగా భావిస్తున్నారు. తాలిబన్లు తమను చంపినా అది దేవుడి సేవలో భాగమేనని తాను భావిస్తానని రాజేష్ కుమార్ ఖండితంగా చెప్పాడు. తను భారత దేశానికి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చాలామంది హిందువులు చెప్పారని, అయినా తనకు ఇష్టం లేదని అన్నారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..