కస్టమర్ల కక్కుర్తి.. మూతబడ్డ రెస్టారెంట్..

  0
  5526

  కస్టమర్ల కక్కుర్తి.. మూతబడ్డ రెస్టారెంట్..

  ఓ రెస్టారెంట్ ఓనర్ సదుద్దేశంతో బిజినెస్ పెంచుకునేందుకు ప్రవేశ పెట్టిన ఓ స్కీమ్ చివరకు రెస్టారెంట్ మూత వేసేందుకు కారణం అయింది. కొంతమంది ప్రజలు కొన్ని విషయాల్లో ఎంత నీఛంగా ఉంటారో, ఎంతగా కక్కుర్తి పనులకు పాల్పడతారో ఈ రెస్టారెంట్ స్కీమే ఉదాహరణ. హసన్ అబీబ్ మాంచెస్టర్ లో ఓల్దామ్ అనే రెస్టారెంట్ కి యజమాని. తన రెస్టారెంట్ లో ఆయన ప్రవేశ పెట్టిన స్కీమ్ ప్రపంచంలోనే వినూత్నమైనది. రెస్టారెంట్ లో ఏ ఫుడ్ ఐటమ్ అయినా బాగోలేకపోతే రిటర్న్ చేయొచ్చని, మళ్లీ కోరిన ఫుడ్ ఐటమ్ ఇస్తానని ఆయన ప్రకటించారు.

  దీంతో ఫుడ్ ఐటమ్స్ ఆన్ లైన్ లో బుక్ చేసిన వారంతా దాదాపు 80శాతం మంది ముప్పాతిక భాగం తినేసి, ఆ తర్వాత ఫుడ్ ఐటమ్ బాగోలేదని రిటర్న్ మెసేజ్ ఇచ్చారు. దీంతో యజమాని తను ప్రవేశ పెట్టిన పథకాన్ని గౌరవిస్తూ మళ్లీ ఫ్రెష్ గా కస్టమర్లకు ఫుడ్ ఐటమ్స్ పంపించడం మొదలు పెట్టాడు. కొంతమందికయితే సగం తిన్న తర్వాత డబ్బులు కూడా రిటర్న్ చేసేవాడు. అయితే ఈ స్కీమ్ కారణంగా హబీబ్ పూర్తిగా దివాళా తీసేశాడు. తనకు చాలా రెస్టారెంట్లు ఉన్నాయని, ఇలాంటి స్కీమ్ లు కొత్తగా ప్రవేశ పెట్టి, వ్యాపారంలో నిజాయితీని, తన రెస్టారెంట్ లో నాణ్యతకు ప్రజలనే న్యాయమూర్తులుగా చేయాలన్న తన ప్రయత్నం బెడిసి కొట్టిందని, ఇప్పుడు తల పట్టుకుంటున్నాడు. దీంతో జస్ట్ ఈట్ అనే పేరుతో ఉన్న రెస్టారెంట్ మూతపడింది.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.