జవాద్ , విశాఖలో సముద్రం అల్లకల్లోలం..

    0
    1205

    ప‌శ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను మ‌రింత బ‌ల‌ప‌డి తీవ్ర తుపానుగా మారింది. అయితే కొద్దిసేప‌టికి క్రితం తీవ్ర తుఫాను… తీవ్ర‌త త‌గ్గిన‌ట్లు వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. ఇది రేపు శ్రీకాకుళం లేదా ఒడిషా మ‌ధ్య తీరం దాట‌వ‌చ్చ‌ని పేర్కొంది. అలాగే కొన‌సాగితే వాయుగుండంగా మారే అవ‌కాశ‌ముంద‌ని స్ప‌ష్టం చేసింది. తుఫాను తీవ్ర‌త కాస్త త‌గ్గినా స‌ముద్రం మాత్రం అల్ల‌క‌ల్లోలంగా ఉంటుంద‌ని, కెరటాలు ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డ‌తాయ‌ని పేర్కొంది. తుఫాను ప్ర‌భావంతో ఇప్ప‌టికే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.

    ఉత్త‌రాంధ్రలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోనూ ఓ మోస్త‌రు వ‌ర్ష‌పాతం న‌మోద‌వుతుంద‌ని తెలుస్తోంది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో వేట‌కు వెళ్ళ‌రాద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం తుపాను వాయువ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మ‌రోవైపు తుఫాను ప్ర‌భావం కార‌ణంగా 74 రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు రైల్వే శాఖ తెలిపింది.

     

     

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.