జీవిత , రాజశేఖర్ కూతుళ్లులో శివాత్మిక ప్రియుడితో దుబాయ్ పారిపోయిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై కూతుళ్ళిద్దరు శివానీ, శివాత్మిక కస్సుమన్నారు. ఎవరు ..? ఎవరితో పారిపోయారో కూడా చెప్పండి.. నేను కాదు , మా అక్క పారిపోయింది.. ఎక్కడికో తెలుసా ..? ఎవరితోనో తెలుసా.. ?? మా అమ్మ , నాన్నలతో , ఇద్దరం ఇదిగో దుబాయ్ లో అంటూ ఇంస్టా లో ఫొటో షేర్ చేశారు.
ప్రియుడితో లేచి పోయింది ఇంతకీ ఎవరంటారు..? నేనా , మా అక్కా .. ఏదో ఎవరో చెప్పండి.. అంటూ హేళన చేశారు. అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ కూడా ఎవరో చెప్పండి అంటూ మండిపడ్డారు. కనీసం పుకార్లు రాసేటప్పుడైనా బాగా రాయండి. అర్ధం చేసుకోవాలికదా ..?
బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయింది నేనా? లేదా మా అక్కనా? కరెక్ట్‌గా చెప్పండి’ అంటూ ఫైర్ అయింది. నాన్ సెన్స్ న్యూస్ క్రియేట్ చేయొద్దు.. నిజాలు రాయండి.. అంటూ మండిపడ్డ కూతుళ్లిద్దరూ , శనివారం , కాలి నడకన తిరుమలకు చేరుకున్నారు.