రక్తపు మడుగులో క్రికెటర్ షేన్ వార్న్ శవం.. ఏమిజరిగింది..?

  0
  857

  ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ బ్యాంకాక్ లో చనిపోయిన గదిలో రక్తం మడుగు ఉందని పోలీసులు చెప్పారు. షేన్ వార్న్ పడుకున్న మంచం పరుపు , దిండ్లు , కింద కార్పెట్ మీద రక్తం ఉందని తెలిపారు. షేన్ వార్న్ అపస్మారకంగా ఉన్న సమయంలో , ఆయన స్నేహితులు , సిపిఆర్ చేశామని చెబుతున్నారు. ఆ సమయంలో ఛాతీ వత్తినప్పుడు , కొంత ద్రవ పదార్ధంతో పాటు , రక్తం కూడా కక్కుకున్నాడని చెప్పారు. దీంతో ఇప్పుడు షేన్ వార్న్ మరణంపై మిస్టరీ నెలకొనింది. షేన్ వార్న్ గుండె ఆగిపోవడంతో చనిపోయాడా , లేక ఊపిరితిత్తులు వ్యాధితో చనిపోయాడా , లేదా మరేదైనా కారణం ఉందా అని నిర్ణయించాల్సి ఉంది..

  షేన్ వార్న్ , విపరీతంగా మద్యం తాగుతాడు.. సిగరెట్లు , మాంసం లేనిదే ఉండలేడు. ఆస్ట్రేలియాలో కూడా ఆయనకు నివాళి అర్పించే సమయంలో , అభిమానులు , మెల్ బోర్న్ లోని క్రికెట్ స్టేడియం ముందున్న ఆయన కాంస్య విగ్రహం దగ్గర , సిగరెట్లు , మద్యం , మాంసం , పెట్టి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు..

  మూడు నెలల్లో చూడండి.. పాత షేపు లోకి వచ్చేస్తానంటూ ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ , తన ఇంస్టా గ్రామ్ లో పోస్టింగ్ పెట్టిన , కొద్ది రోజుల్లోనే ఇలా చనిపోవాదం నిజంగా విడి విచిత్రమే,, బ్యాంకాక్ లో ఉండగానే ఆయన తన మార్నింగ్ వర్కవుట్ తరువాత ఈ ఫొటో షేర్ చేశారు. దానితరువాత , చనిపోయే దానికి 12 గంటలముందు , ఆస్ట్రేలియా వికెట్ కీపర్ రోడ్నీ మార్ష్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. విచిత్రంగా తరువాత తానే కనుమరుగైపోయాడు..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..