టెన్త్ పరీక్షలు కాకముందే ఇంటర్ అడ్మిషన్లు..

    0
    66

    ఏపీలో టెన్త్ పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. ఈలోగా కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇంటర్ అడ్మిషన్లు నిర్వహిస్తూ తల్లిదండ్రుల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇటీవల ఈ వ్యవహారంపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. ఇలాంటి పనులు చేస్తే తాటతీస్తామని కాలేజీల యాజమాన్యాలను హెచ్చరించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వమే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు అంటూ కామెడీ చేయడం మొదలు పెట్టింది. 2021-22 విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు అంటూ సాంఘిక సంక్షేమ శాఖ పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని కూడా సెలవిచ్చారు. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తామంటూ.. ఆన్ లైన్లో దరఖాస్తులు సమర్పించాలంటూ వెబ్ సైట్ చిరునామా ఇచ్చింది. ఇప్పటి వరకూ టెన్త్ పరీక్షల ఊసే లేదు, ఇప్పుడు ఇంటర్ అడ్మిషన్లు ఎరా చేస్తారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పోనీ ఈసారి కూడా కరోనా బ్యాచ్ ఆల్ పాస్ అంటూ ప్రభుత్వం ఏదయినా ఉత్తర్వులిచ్చిందా అంటే అదీ లేదు. మరి టెన్త్ పరీక్షలు లేకుండానే ఇంటర్ అడ్మిషన్లు అంటూ ఈ హడావిడి ఏంటో తేలియాల్సి ఉంది.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..