తల్లిని చంపి, శవాన్ని తిన్న కొడుక్కి జైలు

  0
  935

  తల్లిని చంపి, ఆమె శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి, తాను తిని, తన కుక్కలకు ఆహారంగా వేసిన ఓ నీఛపు కొడుకు గోమెజ్ కు మ్యాడ్రిడ్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరో 73వేల డాలర్లు, అతడి సోదరుడికి నష్టపరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. గత 3 నెలలుగా జరిగిన కోర్టు విచారణలో గోమెజ్ ను మాతృ హంతకుడిగా, నరమాంస భక్షకుడిగా కోర్టు గుర్తించింది. అతను మానసిక పరిస్థితి సరిగాలేదన్న కారణంతో విడుదల చేయాలన్న న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించింది. తల్లితో ఓ విషయమై జరిగిన గొడవలో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత రంపంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి కొన్ని భాగాలను ఫ్రీజర్ లో ఉంచాడు. మిగిలిన వాటిని ప్లాస్టిక్ బ్యాగ్స్ లో వేసి కాల్వలో పారేశాడు. 15రోజులపాటు తల్లి మాంసాన్ని తాను తింటూ, తన కుక్కలకు కూడా ఆహారంగా వేశాడు. తల్లి కనపడకపోవడంతో సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, విచారణ చేపట్టిన పోలీసులకు ఇతను చేసిన ఘోరమైన పని తెలిసింది. దాంతో అరెస్ట్ చేసి విచారణ చేపట్టి నేరం రుజువు చేశారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..