పోలీసు పొరపాటు..అమ్మాయి 200 కోట్లకు దావా.

  0
  88

  అలవాటులో పొరపాటు మన పోలీసులే కాదు , అమెరికా పోలీసులు కూడా చేసేస్తుంటారు . ప్రపంచంలోనే ప్రతిభావంతులైన పోలీస్ గా పేరుపొందిన న్యూయార్క్ పోలీసు ఇప్పుడు దాదాపు 220 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసులో చిక్కిపోయింది . ఇంతకీ దీని వెనక కథేమిటో చూడండి. ఇంస్టాగ్రామ్ లో పాపులర్ మోటివేటర్ అయిన ఇవాలోపేజ్ అనే మహిళ , దొంగతనం కేసులో పరారీలో ఉందని పోలీసులు ప్రకటించారు. ఆమె ఫొటోతో సహా పోస్టర్లు వేసి నగరమంతా పంచారు.

  ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ , బస్టాండ్ వద్ద ప్రముఖంగా పెట్టారు. పోస్టర్లు కూడా ఉంచారు. అసలు విషయం ఏమిటంటే , ఆమెకు ఈ దొంగతనానికి ఎటువంటి సంబంధం లేదు. అసలు దొంగను వదిలేసి ఆమె ఫొటోతో కరపత్రాలను ముద్రించారు . క్లారా అనే అమ్మాయి తన స్నేహితురాలు తన గదిలో డబ్బు, నగలు , రోలెక్స్ వాచీ తీసుకుని పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  ఆసమయంలో ఆ యువతి ఇచ్చిన తన స్నేహితురాలి ఫోటో పక్కన పెట్టేసిన పోలీసులు, ఇంస్టాగ్రామ్ లో , లోపెజ్ ఇవా ఫోటో చూసి అదే ఆ యువతి ఫోటో అనుకొని పోస్టర్లు వేశారు. ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్ లలో కూడా దీన్ని షేర్ చేశారు . దీంతో పోలీసులు తనను దొంగగా పోస్టర్లు వేశారని , తన పరువు పోయిందని దావా వేసింది.
  ఇప్పుడు పోలీసులు ఆ యువతికి వంద కోట్ల రూపాయలకు తగ్గకుండా నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది . అసలు ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఇవా ఫోటో , దొంగ ఫోటో స్థానంలో ఎలా వచ్చిందని ఇప్పుడు పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..