పాముతో ఆటాడుకున్నాడు.. ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు..

  0
  619

  ఒక‌టి కాదు రెండు కాదు.. మూడు పాముల‌తో ఓ వ్య‌క్తి ప‌రాచ‌కాలు ఆడాడు. పాముల్ని వ‌శం చేసుకుంటాన‌ని, తాను చెప్పిన‌ట్లే పాములు వింటాయ‌ని చెప్పి వీడియో తీయాల‌నుకున్నాడు. యూట్యూబ‌ర్ అయిన మాస్ స‌య్య‌ద్ అనే యువ‌కుడు క‌ర్నాట‌క‌లోని సిర్సికి చెందిన వాడు.

  పాముల‌తో ఆటలాడుతూ వీడియో తీసి త‌న‌ యూట్యూబ్ లో పెట్టాల‌నుకున్నాడు. అయితే పాముల‌తో స‌య్య‌ద్ ఆట విక‌టించింది. ఒక పాము అత‌న్ని కాటేసింది. దీంతో అతిక‌ష్టం మీద ఆ పామును వ‌దిలించుకున్నాడు. స్పృహ కోల్పోయిన స‌య్య‌ద్ ను స్నేహితులు ఆస్ప‌త్రిలో చేర్పించారు. 46 యాంటీ వీన‌మ్ ఇంజ‌క్ష‌న్లు ఇచ్చిన అనంత‌రం అతిక‌ష్టం మీద ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

  పాములు స‌హ‌జంగా మ‌నిషి క‌ద‌లిక‌ల‌ను ఆప‌ద‌గా భావిస్తాయి. అందుక‌నే మ‌నిషి క‌ద‌లిక‌ల‌కు అనుగుణంగాపాము క‌దులుతుంది. ఒక్కోసారి జాగ్ర‌త్త‌గా లేక‌పోతే పాము కాటుకి బ‌లి అవ్వాల్సి వ‌స్తుంది. స‌య్య‌ద్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. మొత్తానికి చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌పోయిన‌ట్లు రెండు వారాల త‌ర్వాత స‌య్య‌ద్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..