విమానంలో చిక్కుకుపోయిన ఎమ్మెల్యే రోజా.. టెన్షన్ టెన్షన్..

  0
  51526

  ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ సహా మరో 13మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కళ్లముందే ఆ ఘోరం కనపడుతోంది. ఈ దశలో విమానం, హెలికాప్టర్ గురించి ఏ వార్త తెలిసినా జనం భయాందోళనలకు గురవుతున్నారు. సరిగ్గా ఈ ఉదయం ఎమ్మెల్యే రోజాతోపాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందనే వార్త అందరికీ ఆందోళన కలిగించింది. రేణిగుంటకు రావాల్సిన ఈ విమానాన్ని దారి మళ్లించడంతో అందులో ఉన్న ప్రయాణికులు కూడా గుండెలు గుప్పెట్లో పట్టుకుని భయపడుతూ ఉన్నారు. రాజమహేంద్రవరం నుంచి రేణిగుంట వెళ్లాల్సిన ఈ విమానం. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో విమానాన్ని బెంగళూరుకి తరలించారు. విమానంలో రోజాతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.