కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని దుండగులు కాల్చిచంపారు. కార్తీక్ వాసుదేవ్ అనే విద్యార్థి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కి చెందిన వాడు. కెనడా లో మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు . పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కాలేజీ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి టొరంటో రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తున్న సమయంలో దొంగలు అతడిని కాల్చిచంపారు . అతని వద్ద డబ్బులు తీసుకునే ప్రయత్నంలోనే కాల్పులు జరిపి చంపేశారని చెబుతున్నారు. దొంగల ప్రయత్నాన్ని కార్తిక్ ప్రతిఘటించడంతో ఇంత ఘోరం జరిగింది . స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది . మరో మూడు రోజుల్లో మృతదేహాన్ని ఇండియాకి పంపిస్తున్నట్లు కెనడాలోని భారతీయ విదేశాంగ శాఖ ప్రకటించింది.