హైదరాబాద్ హోమ్ గార్డు జీవితం ధన్యం.. స్ఫూర్తివంతం ..ఎందుకో చూడండి.

  0
  860

  ఒక ఒక హోంగార్డుని , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనంతట తానుగా రోడ్లో కారు నిలిపి సన్మానం చేయడం .. ఇదేదో సినిమాలో సీన్ లాగానే ఉంటుందని మాత్రం అనుకోవద్దు , ఇది నిజంగా హైదరాబాదులోనే జరిగింది . బహుశా దేశంలో ఒక సాధారణ హోంగార్డుని , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో ఉన్న వ్యక్తి తనంతట తానుగా కోర్టుకు పోతూ , ట్రాఫిక్ లో కారు ఆపి సత్కరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఒకరకంగా ఇది ఆ హోంగార్డు అదృష్టం . వృత్తిపట్ల నిబద్ధత గల వారిని గుర్తించే హైకోర్టు న్యాయమూర్తి ఉదారత్వనికి ఇదో నిదర్శనం. హోంగార్డు కే కాదు పోలీస్ వ్యవస్థ కే స్పూర్తిదాయకమైన చర్య .

  ఇంతకీ అసలు విషయానికి వస్తే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ అష్రాఫ్ అలీ అనే హోంగార్డుని కారు ఆపి సన్మానం చేశారు . ఈ హోంగార్డు ఆబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద డ్యూటీ చేస్తుంటాడు. ట్రాఫిక్ డ్యూటీ లో ఉండే ఈ హోంగార్డుని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి రోజూ గమనిస్తూ పోతుంటారు. ఆ సమయంలో ఆ హోంగార్డు ట్రాఫిక్ నియంత్రణలో అంకితభావాన్ని ,చిత్తశుద్ధిని, వృత్తి ధర్మాన్ని, హైకోర్టు న్యాయమూర్తి ప్రశంసించారు.

  ఎవరో ఉన్నతాధికారులు ఇంకెవరో చెబితే ఆయన ప్రశంసలు అందించలేదు . తనంతట తానుగా ప్రతిరోజు హైకోర్టుకు పోతూ చూసి అతను డ్యూటీ చేసే విధానాన్ని మెచ్చుకొని ఈ సన్మానం చేశారు. నిజంగా ఇందులో హోంగార్డు వృత్తి ధర్మాన్ని ఎంతగా మెచ్చుకోవాలో , దాన్ని గుర్తించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ని కూడా అంతే ప్రశంసించాలి..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..