యుద్ధభూమిలో కూడా ఆ ప్రేమ పక్షులు వీడిపోలేదు.. ఒకరికొకరు తోడుగా , నీడగా , రెండు రోజులు నిద్రాహారాలు లేకుండా మరణహోమం జరుగుతున్న ఉక్రెయిన్ నుంచి పారిపోయి , ఎట్టకేలకు పొరుగుదేశం రోమానియా లోని ఒక పల్లెటూళ్ళో తలదాచుకున్నారు.. ఇదేదో సినిమా కు పనికొచ్చే కధే,.. ఆ ప్రేమ పక్షులిద్దరూ భారతీయులే.. ఇప్పుడు ఇతర శరణార్థులతో కలిసి , రోమానియా లో ఉంటూ , మనదేశం పంపే విమానం కోసం ఎదురు చూస్తున్నారు.
హర్ష పవార్ , రేవా శ్రీవాత్సవ మంచి స్నేహితులు , ప్రేమికులు కూడా .. పశ్చిమ ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్నారు. యుద్ధం మొదలైన వెంటనే , ఇద్దరూ , రెండు రోజులు నడిచి బార్డర్ వద్దకు చేరుకున్నారు.. రుమేనియా బార్డర్ వద్ద గార్డ్స్ ని కాళ్ళు చేతులుపట్టుకొని దాటుకున్నారు. వీరిలాగే చాలామందికూడా రుమేనియాలో ఒక పల్లెకు చేరుకున్నారు. అక్కడి ప్రభుత్వం వీరందరికీ ఇక కల్యాణమండపంలో వసతి ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు.. మన దేశంనుంచి వచ్చే విమానం కోసం ఎదురుచూస్తున్నారు..