కాన్పుకి లంచం ఇవ్వలేదని కడపలో నర్సు నీచత్వం..

  0
  394

  డబ్బు కోసం యెంత నీచానికైనా దిగజారేవాళ్లను చూసాంగానీ , కడపలో లాంటి నర్సును బహుశా చూసిఉండరు. హాస్పిటల్ తాను అడిగిన లంచం ఇవ్వలేదని ఆ నర్సు ఉన్మాదిగా మారి , మహిళా రోగిని మానసికంగా చిత్ర హింసలు పెట్టింది.. వినేందుకే భయం కలిగించేట్టు ప్రవర్తించిన ఆ నీచురాలిపై విచారణ చేసి కలెక్టర్ కి నివేదిక పంపారు. కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన సోమాపురం గ్రామం నుంచి ఓ మహిళ కడప ప్రభుత్వ హాస్పిటల్లో కాన్పు కోసం చేరింది. కాన్పు అయిన తరువాత , తనకు 2 వేల రూపాయలు ఇవ్వాలని నర్సు లత డిమాండ్ చేసింది.

  పేద మహిళనని , తాను డబ్బులు లేకనే ప్రభుత్వ హాస్పిటల్లో చేరానని చెప్పింది. తనకు డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో , నర్సు లత , బాలింతగా ఉన్న సుభాషిణికి ఎయిడ్స్ ఉందని అబద్దం చెప్పింది. వార్డులో ఇతర పేషేంట్లకూ చెప్పింది. దీంతో మనోవేదనకు గురైన , మహిళ బంధువులు టెస్ట్ చేయించగా అబద్దం అని తేలింది. ఈ విషయం హాస్పిటల్ సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. తనకు లంచం డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో ఆ నర్సు ఇలా చెప్పిందని తేలింది. విచారణ నివేదికను అధికారులు కలెక్టర్ కు పంపారు..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..