ప్రపంచంలో ఆరుగురిలో ఒకడు, ఈ కూలీ బిడ్డ.

    0
    562

    ప్రపంచంలో అమెరికాలోని ఆ కాలేజీలో స్కాలర్ షిప్ కి ఎంపికైన ఆరుగురు విద్యార్థుల్లో కూలిచేసుకొని చదువుకునే ప్రేమ్ అనే ఈ దళిత యువకుడు ఒకడు.. ఆ స్కాలర్ షిప్ మొత్తం రెండున్నర కోట్లు రూపాయలు. తల్లి తండ్రులు , వ్యవసాయ కూలీలు.. ప్రేమ్ కూడా పగలు స్కూల్ కి పోయి , ఇంటికొచ్చిన తరువాత , రాత్రివరకు కూలిపనులు చేసి సంపాదించిన డబ్బులతో చదువుకుంటాడు. ప్రస్తుతం ప్లస్ టు చదువుతున్న ప్రేమ్ , అమెరికాలోని లేఫాయిట్ కాలేజీలో రెండున్నర కోట్లు రూపాయలు స్కాలర్ షిప్ కి సెలెక్ట్ అయ్యాడు.

    1826 లో స్థాపించిన ఈ కాలేజీలో , ప్రేమ్ మెకానికల్ ఇంజినీరింగ్ , ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సులు చేస్తాడు. ప్రపంచంలో ఆరు మందినే ప్రతిష్టాకరమైన ఈ స్కాలర్ షిప్ కి ఎంపిక చేస్తారు. డయార్ ఫెలోషిప్ గా పిలిచే , ఈ స్కాలర్ షిప్ కి ఎంపిక కావాలంటే , చాలా కష్టసాధ్యమైన పని. అలాంటిది , ప్రపంచ వ్యాప్తంగా వేలమంది పోటీపడే విద్యార్థుల్లో ఆరుగురినే అదృష్టం వరిస్తుంది. అలాంటిది బీహారులో గోనుపుర గ్రామంలోని , అతి పేదవాడైన ఈ దళిత యువకుడిని అదృష్టం వరించింది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నసామెతకు , ప్రేమ్ అనే ఈ పేద యువకుడు నిలువెత్తు సాక్ష్యం..

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.