అమరావతి నుంచి ఏ ఆఫీసు మార్చకూడదు..హైకోర్టు సంచలన తీర్పు..

    0
    412

    అమరావతి నుంచి రాజధానిని తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, హైకోర్టు స్పష్టం చేసింది. CRDA రద్దు, మూడురాజధానుల అంశంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. CRDA ని రద్దు చేసే హక్కు అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. ఒక ప్రత్యేక చట్టం క్రింద ఏర్పాటైన CRDA ను ఎలా రద్దు చేస్తారని నిలదీసింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేసింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని తరలించవద్దని ఆదేశించింది.

    ఆరు నెలల్లోపు CRDA మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని, ఆదేశించింది. ఎప్పటికప్పుడు తమకు నివేదిక అందించాలని, స్పష్టం చేసింది. ఆరునెలల్లోపు అమరావతి రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి చేసి, వాటిలో ప్లాట్లను రైతులకు కేటాయించాలని కూడా తీర్పులో స్ఫష్టం చేసింది. అమరావతి రాజధాని కోసం కేటాయించిన భూములను రాజధాని అవసరాలకు తప్ప.. వేరే వాటికి తాకట్టు పెట్టరాదని స్పష్టం చేసింది. అమరావతిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు హైకోర్టుకు నివేదించాలని కూడా ఆదేశించింది.

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..