టూత్ పేస్ట్ అనుకొని ఎలుకలమందు టూత్ బ్రష్ పై వేసుకొని..

  0
  734

  పొరపాటో గ్రహపాటో తెలియదుగానీ , టూత్ పేస్ట్ అనుకొని ఎలుకలమందు టూత్ బ్రష్ పై వేసుకొని చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతొంది. విచిత్రం ఏమిటంటే వీరిలో ఎక్కువమంది మహిళలే.. తాజాగా కర్ణాటకలోని మంగుళూరు జిల్లా సుల్లియా అనే ప్రాంతంలో శ్రావ్య అనే యువతి , టూత్ బ్రష్ పై , పేస్ట్ అనుకొని , ఎలుకల మందు వేసుకొని బ్రష్ చేసుకొంది. కొద్దిసేపటికే తాను పొరపడ్డానని ఊసేసి , నీళ్లతో నోరు పుక్కిలించింది. కొద్దిసేపటికే అస్వస్థతకు గురైంది. వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కొద్దిసేపటికే చనిపోయింది.

  కర్నాటకలో ఇటీవలకాలంలో ఇది మూడో సంఘటన.. గతంలో మహారాష్ట్ర , పశ్చిమబెంగాల్ , తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి. ట్యూబ్స్ లో ఉండే ఎలుకలమందును , బాత్ రూమ్ , గోడలపైన పెడతారు. దాదాపుగా టూత్ పేస్టులు కూడా అక్కడే పెడతారు.. నిద్రమత్తులోనో , లేదా కాలేజీకో , ఆఫీసుకో పోయే హడావుడిలో పొరపాటున ఎలుకలమందును బ్రష్ పై వేసేసుకుంటారు. బ్రష్ చేసినప్పుడు , చిగుళ్ళలో నుంచి , ఎలుకల మందులో విషం చాలా త్వరగా శరీరంలోకి పోయి , మరణం సంభవిస్తుంది. తాజాఘటనలో మృతురాలు శ్రావ్య , మంగుళూరు జిల్లా పుత్తూరులో పియుసి చదువుతొంది..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..