కరోనా వల్ల అనాథలైన పిల్లలు 30వేలమంది..

  0
  62

  కరోనా కష్టకాలంలో అమ్మా నాన్నల్ని కోల్పోయి అనాథలైన పిల్లల వివరాలు అందించాలని, వారిని ఆదుకోవాలంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించడంతో.. జాతీయ బాలల హక్కుల కమిషన్ లెక్కలు తీసింది. దేశంలో 30వేలమందికి పైగా పిల్లలు కరోనా కాలంలో అనాథలుగా మారారని సుప్రీంకోర్టుకి తెలిపింది. తల్లి లేదా తండ్రి, లేదా ఇద్దర్నీ కోల్పోయిన పిల్లలు భారత్ లో 30వేలమంది ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో పిల్లల్ని అనాథలుగా మార్చిన విలయం భారత చరిత్రలో ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. 30,071మంది పిల్లలు అనాథలుగా మారారు. తల్లి, లేదా తండ్రి ఎవరో ఒకర్ని కోల్పోయి సింగిల్ పేరెంట్ చైల్డ్ గా ఉన్నవారు 26,176 మంది కాగా, 3,621మంది తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయి అనాథలుగా మారారు. ఇక 274మంది పిల్లలు అసలు బంధువులు కూడా లేకుండా.. పూర్తిగా అనాథలై ఎటు పోయారో తెలియకుండా వెళ్లిపోయారు. మహారాష్ట్రలో చాలా దారుణమైన పరిస్థితులున్నాయి. అక్కడ మొత్తం 7,084మంది పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, ఏపీ, కేరళ, బీహార్, ఒడిశా.. ఈ రాష్ట్రాల్లో కూడా అనాథ పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది.
  14,447మంది పిల్లలు, అందరూ 3నుంచి 13ఏళ్లలోపువారే ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేటు వ్యక్తులు, స్వచ్చంద సంస్థల ముసుగులో అక్రమంగా దత్తత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లల్ని అమ్ముకుంటున్నారు. కరోనా కష్టకాలంలో వీరిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..