భారత్ లో కరోనా రికార్డు బ్రేక్..

    0
    147

    భారత్ లో సెకండ్ వేవ్ వ్యాప్తి పీక్ స్టేజ్ కి చేరుకుంది. తొలి దశలో నమోదైన కేసులకంటే ఇప్పుడు మరీ ఎక్కువగా కేసులు వెలుగులోకి రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గతేడాది జనవరి 30న భారత్ లో తొలి కేసు బయటపడింది. ఆ తర్వాతనుంచి రోజుకి 10, 100, వెయ్యి.. ఇలా కేసుల సంఖ్య పెరుగుతోపోయింది. ఓదశలో లక్ష కేసులకు చేరువయినా.. ఆ డేంజర్ మార్క్ మాత్రం దాటలేదు. అయితే సెకండ్ వేవ్ ఆ మార్క్ చెరిపేసింది. ఇప్పుడు కరోనా కొత్త కేసుల సంఖ్య రోజుకి లక్ష దాటేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో దేశంలో 1,03,558 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో రావడం ఇదే తొలిసారి. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో లక్షకు పైగా కొత్త కేసులు నమోదైన రెండో దేశం భారత్‌ కావడం గమనార్హం. ఇక తాజాగా నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఒక్క మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి.

    అగ్రస్థానంలో.. అమెరికా..
    24 గంటల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదైన తొలి దేశం అమెరికా. అక్కడ ఈ ఏడాది జనవరి 8న అత్యధికంగా 3.08లక్షల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అమెరికా తర్వాత భారత్‌లోనే రోజువారీ కేసులు అత్యధికంగా ఉన్నాయి. తాజాగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మన దేశంలో 1.03లక్షల మందికి వైరస్‌ సోకింది. అమెరికా, భారత్‌ మినహా ఏ దేశంలోనూ ఇప్పటివరకు ఒక రోజులో లక్షకు పైగా కేసులు నమోదు కాలేదు.

    ఇవీ చదవండి

    ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

    నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

    మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

    సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు