జవాన్ల కుటుంబాలకు సీఎం జగన్ ఆర్థిక సాయం..

  0
  544

  ఛత్తీస్ ‌గఢ్‌లో జరిగిన మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ జవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఒక్కో కుటుంబానికి రూ.30లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం జగన్. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఈ సందర్భంగా జగన్‌ పేర్కొన్నారు.
  చత్తీస్ ఘడ్ బీజాపూర్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ, విజయనగరం పట్టణంలోని గాజులరేగకు చెందిన రౌతు జగదీశ్‌ మృతిచెందారు. వీరి కుటుంబాలను ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు