నక్సల్స్ చెరలో సీఆర్పీఎఫ్ జవాను..

  0
  484

  చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భద్రతా దళాలపై పడి దారుణ మారణహోమం సృష్టించిన నక్సలైట్లు ఒక సీఆర్పీఎఫ్ జవాన్ ను బందీగా పట్టుకున్నారు. 24మందిని చంపేసిన నక్సలైట్లు బందీగా పట్టుకున్న సీఆర్పీఎఫ్ జవాన్ విషయాన్ని బీజాపూర్ జర్నలిస్ట్ లకు ఫోన్ ద్వారా తెలియజేశారు. నేరుగా ఈ మారణహోమానికి కారణం అయిన నక్సల్ నేత హిద్మా నేరుగా జర్నలిస్ట్ కి ఫోన్ చేశాడని, తమ ఆధీనంలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ క్షేమంగా ఉన్నాడని చెప్పాడని చెప్పారు. బీజాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికే ఈ ఫోన్ కాల్ నేరుగా వచ్చిందని ఆయన చెప్పాడు. రాజాసింగ్ రాథోడ్ అనే మరో జర్నలిస్ట్ కి కూడా గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందని తాను హిద్మాని మాట్లాడుతున్నానని చెప్పాడని, సీఆర్పీఎఫ్ తమ అధీనంలోనే క్షేమంగా ఉన్నాడని, ఫొటోలు, మరిన్ని వివరాలు త్వరలో పంపుతానని చెప్పాడని చెప్పారు. తప్పిపోయిన సీఆర్పీఎఫ్ జవాను భార్య మాత్రం తన భర్తను ఎలాగైనా కాపాడండి అంటూ వేడుకుంటోంది. పాకిస్తాన్ నుంచి అభినందన్ ను వెనక్కు తెప్పించేందుకు కృషిచేసినట్టే తన భర్తను నక్సల్స్ చెరనుంచి విడిపించాలని ప్రధాని మోదీని, ప్రభుత్వాన్ని వేడుకుంది.

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు