ఆహా.. చురకత్తుల్లాంటి మాటలతో ఆమె ..

    0
    128

    పాకిస్తాన్ కుటిల నీతిని , కుట్రలను , ఉగ్రవాద దుర్బుద్ధిని చీల్చి చెండాడిన స్నేహదుబే ఇప్పుడు దేశంలో స్టార్ లేడీ.. ఐక్యరాజ్య సమితి సర్వసభ్యసమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను చురకత్తుల్లాంటి మాటలతో చెండాడింది. ఒక వైపు ఉగ్రవాదుల హింసకు బలైపోతున్నా , మరో వైపు ఉగ్రవాదుల స్వర్గధామంగా పాకిస్తాన్ ను ఎలా మార్చారో మధురమైన మాటలతో , బల్లెం దించినట్టు చెప్పింది.

    ఇన్నేళ్లుగా పాకిస్తాన్ చేస్తున్న ద్వంద నీతిని , నీచ రాజకీయాన్ని , భారత్ పై విషం చిమ్ముతున్న విధానాన్ని బట్టబయలు చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మిర్ ను తక్షణమే ఖాళీ చేసి , భారత్ కు అప్పగించాలని డిమాండ్ చేసింది. పాకిస్తాన్ లో మైనారిటీలను ఊచకోతకోస్తూ , ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న దుశ్చర్యలను ఎండగట్టింది..

    స్నేహా దూబే ఉపన్యాసంతో , దేశ ప్రజలంతా ,ఆమె వివరాలకోసం నెట్ లో సాధించారు.,. భారత విదేశాంగ శాఖలో అధికారిగా , ఆమె చేసిన ప్రసంగం దేశ ప్రజల్లో ఉత్తేజం కలిగించింది. 10 నిమిషాల్లో పాకిస్తాన్ దుర్నీతిని ప్రపంచానికి సమర్థవంతంగా చాటిచెప్పింది. స్నేహా దూబే 2012 బ్యాచ్ ఐఎఫ్ ఎస్ అధికారి. గోవా , పూణే , ఢిల్లీ లో ఆమె చదువు కున్నారు. ఆమె తల్లి టీచర్ , తండ్రి ఒక మల్టి నేషనల్ కంపెనీ ఉద్యోగి. మొదటి ప్రయత్నంలోనే ఆమె సివిల్ సర్వీస్ పరీక్షలు 2011 లో పాసయ్యారు. ప్రస్తుతం ఆమె ఐక్యరాజ్యసమితిలో ఇండియా ఫస్ట్ సెక్రెటరీగా ఉన్నారు.. ఒక్క సారిగా ఆమె దేశప్రజల దృష్టిని ఇలా ఆకర్షించారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.